పవన్ కల్యాణ్ ఏపీ సీఎం అవ్వాలని భావిస్తున్నాను: తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ

03-04-2021 Sat 14:26
  • పవన్ ఏపీ సీఎం అభ్యర్థి అంటూ ఇటీవల సోము వ్యాఖ్యలు
  • మోదీ నేతృత్వంలో పవన్ ముఖ్యమంత్రి అంటూ రత్నప్రభ ట్వీట్
  • ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని వెల్లడి
  • ఆంధ్ర ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని వివరణ
Rathna Prabha wants to see Pawan Kalyan as AP CM

గత కొన్నిరోజులుగా పవన్ కల్యాణ్ ఏపీ సీఎం అభ్యర్థి అనే అంశం చర్చకు వస్తోంది. సోము వీర్రాజు వ్యాఖ్యలతో మొదలైన ఈ అంశంపై తాజాగా తిరుపతి లోక్ సభ స్థానం బీజేపీ అభ్యర్థి రత్నప్రభ కూడా స్పందించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చగల పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్టు వెల్లడించారు.

తమ కుటుంబాల కోసం పార్టీలు నడిపే టీడీపీ, వైసీపీ అవినీతి, అరాచక పరిపాలనకు విసిగిపోయిన ఆంధ్ర ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని రత్నప్రభ పేర్కొన్నారు. ఇటీవల సోము వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కల్యాణ్ 100 శాతం ఏపీ సీఎం అభ్యర్థి అని జనసేన పార్టీ ఉద్ఘాటించడం తెలిసిందే.