సీబీఐ వాళ్లు వస్తున్నారట... హైదరాబాదులో కొవిడ్ బెడ్లు రెడీ చేసుకో సాయిరెడ్డీ!: అయ్యన్నపాత్రుడు

03-04-2021 Sat 14:11
  • ట్విట్టర్ లో అయ్యన్న విసుర్లు
  • ఏ2 దొంగ రెడ్డీ అంటూ వ్యాఖ్యలు
  • బాబాయ్ పై మీరే వేటు వేశారా? అంటూ ప్రశ్న
  • ఏ1 జనాన్ని చూసి వణుకుతున్నాడని ఎద్దేవా
TDP Leader Ayyanna Patrudu satires on Vijayasai Reddy

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మరోసారి ధ్వజమెత్తారు. "ఏ2 దొంగ రెడ్డీ... బాబాయ్ గొడ్డలితో గుండెపై పొడుచుకున్నాడా? లేక మీరే గొడ్డలి వేటు వేశారా? ఓ చెల్లి తెలంగాణ రోడ్లపైనా, మరో చెల్లి ఢిల్లీలో అన్న కాదు అరాచకుడని నినదిస్తూ భయపెడుతున్నారా?" అంటూ ప్రశ్నించారు. "పంచాయతీలు, మున్సిపాలిటీలు గెలిచాం అంటూ కాలర్ ఎగరేస్తున్న ఏ1 వలలు, బారికేడ్లు, 1000 మంది పోలీసుల కాపలాలో వ్యాక్సిన్ వేయించుకున్నాడంటేనే జనాన్ని చూసి ఎలా వణుకుతున్నాడో అర్థమవుతోంది" అని ఎద్దేవా చేశారు. "సీబీఐ వాళ్లు వస్తున్నారట... హైదరాబాదులో కొవిడ్ బెడ్లు రెడీ చేసుకో సాయిరెడ్డీ!" అంటూ చివర్లో చురకేశారు.