మ‌ద్యం మ‌త్తులో ఇంటికి నిప్పంటించిన వ్య‌క్తి.. న‌లుగురు చిన్నారులు స‌హా ఆరుగురి మృతి

03-04-2021 Sat 12:43
  • కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఘ‌ట‌న‌
  • ఇంట్లోని వారంతా నిద్రపోతోన్న స‌మ‌యంలో దారుణం
  • ఇంటి పైక‌ప్పు ఎక్కి, పెట్రోలు పోసి ఇంటికి నిప్పంటించిన వైనం
Six charred to death

మ‌ద్యం మ‌త్తులో ఇంటికి నిప్పంటించి ఆరుగురి ప్రాణాలు తీశాడో క‌సాయి. వారిలో న‌లుగురు చిన్నారులు కూడా ఉన్నారు. మ‌రో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. కుటుంబ తగాదాల కార‌ణంగానే అత‌డు ఆగ్ర‌హంతో ఊగిపోతూ ఈ దారుణానికి పాల్పడిన‌ట్లు తెలిసింది. కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్‌పేట్ తాలూకా ముగుట‌గెరె గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.  ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు పూర్తి వివ‌రాలు తెలిపారు.

ఈ రోజు ఉద‌యం ఇంట్లోని వారంతా నిద్రపోతోన్న స‌మ‌యంలో భోజా (50) అనే తాగుబోతు ఇంటి పైక‌ప్పు ఎక్కి, పెట్రోలు పోసి ఇంటికి నిప్పంటించాడు. దీంతో  ఎనిమిది మంది మంటల్లో చిక్కుకున్నారు.  మంట‌లు అంటుకుని ముగ్గురు అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు మిగ‌తావారిని ఆసుప‌త్రికి త‌ర‌లించగా మ‌రో ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు విచార‌ణ కొన‌సాగిస్తున్నారు.