రామ్‌నాథ్ కోవింద్ ఆరోగ్య ప‌రిస్థితిపై రాష్ట్రప‌తి భ‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌

03-04-2021 Sat 11:53
  • ఐసీయూ నుంచి ప్ర‌త్యేక గ‌దికి తరలింపు 
  • ఆరోగ్య ప‌రిస్థితి మెరుగుప‌డుతోంది
  • విశ్రాంతి తీసుకోవాలని పేర్కొన్న వైద్యులు 
President Kovind was shifted from ICU to a special room in AIIMS today

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవ‌ల అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డంతో ఆయ‌న‌ను మొద‌ట‌ ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ ఆసుప‌త్రికి, అనంత‌రం, ఢిల్లీలోని ఎయిమ్స్‌కు త‌ర‌లించిన విష‌యం తెలిసిందే. అక్కడ ఐదు రోజుల క్రితం ఆయ‌న‌కు బైసాస్ స‌ర్జ‌రీ చేశారు. ఆయ‌న ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్రప‌తి భ‌వ‌న్ ఓ ప్ర‌క‌ట‌న చేసింది.

కోవింద్‌‌ను ఎయిమ్స్‌ ఆసుప‌త్రిలోని ఐసీయూ నుంచి ప్ర‌త్యేక గ‌దికి మార్చిన‌ట్లు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌ తెలిపింది. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి మెరుగుప‌డుతోంద‌ని చెప్పింది. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని వైద్యులు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని, కోవింద్ విశ్రాంతి తీసుకోవాల‌ని చెప్పార‌ని పేర్కొంది.