'పుష్ప' నుంచి ఫస్టు వీడియో .. దుమ్మురేపేస్తోందిగా!

03-04-2021 Sat 11:41
  • అడవి నేపథ్యంలో సాగే కథ
  • గిరిజన యువతిగా రష్మిక
  • బన్నీ పాత్ర చుట్టూ అనేక మలుపులు
Prelude of Pushparaj

మొదటి నుంచి కూడా బన్నీ కథల విషయంలో చాలా కేర్ తీసుకుంటూ వస్తున్నాడు. అలాగే తన లుక్ విషయంలోను అంతే శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఇలా ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం ఆరాటపడటం వల్లనే ఆయన ఖాతాలో సక్సెస్ లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆయన తాజా చిత్రంగా 'పుష్ప' రూపొందుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. అడవి నేపథ్యం .. ఎర్రచందనం స్మగ్లింగ్ .. గిరిజన గూడెం యువతిగా రష్మిక అనే అంశాలు ఈ సినిమాపై మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక వీడియో బిట్ ను వదిలారు. వెనక్కి విరిచి తాళ్లతో కట్టేయబడిన చేతులతో 'పుష్పరాజ్' పారిపోతూ .. తనని తరుముకొచ్చే వాళ్లు ఎంత దూరంలో ఉన్నారన్నది అంచనా వేస్తూ పరిగెత్తడం ఈ వీడియోలో కనిపిస్తోంది. పుష్ప ఫేస్ ను మాత్రం రివీల్ చేయలేదు. ఫొటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందనే విషయం ఈ ఒక్క షాట్ ను బట్టే తెలుస్తోంది.

ఇక హీరోని ఎవరు .. ఎందుకు బంధించారు? అనే ఆసక్తిని ఈ వీడియో రేకెత్తిస్తోంది. ఈ నెల 7వ తేదీన సాయంత్రం 6:12 నిమిషాలకు పుష్ప రాజ్ ను పరిచయం చేస్తామని ఈ వీడియో చివర్లో చెప్పారు. అంటే ఆ రోజున మరో వీడియోను వదలనున్నారని తెలుస్తోంది. ఈ నెల 8వ తేదీన బన్నీ బర్త్ డే కావడం వలన, ఫ్యాన్స్ కోసం ముందురోజునే ట్రీట్ ఇస్తున్నారన్న మాట.