జాడలేని బీజేపీ అభ్యర్థి.. ప్రచారం చేయను పొమ్మన్న సినీ నటి నమిత!

03-04-2021 Sat 10:12
  • రామనాథపురం బీజేపీ అభ్యర్థి కుప్పురాముకు మద్దతుగా ప్రచారానికి నటి
  • అభ్యర్థి కోసం ఎదురుచూసి విసిగిపోయిన నమిత
  • ఇక తన వల్ల కాదంటూ ప్రచారాన్ని రద్దు చేసుకుని హోటల్‌కు వెళ్లిపోయిన వైనం
Actress Namitha Cancells Election Campaign

తాను వెళ్లిన అభ్యర్థి జాడ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ సినీ నటి నమిత ప్రచారం చేయకుండానే వెళ్లిపోయారు. తమిళనాడు ఎన్నికల సందర్భంగా బీజేపీ విస్తృత ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో రామనాథపురం బీజేపీ అభ్యర్థి కుప్పు రాముకు మద్దతుగా గురువారం రామేశ్వరం మునిసిపాలిటీలోని నాలుగు ప్రాంతాల్లో ప్రచారానికి నమిత రెడీ అయ్యారు. ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో మరుదపాండియన్ విగ్రహం సమీపం నుంచి ఆమె ప్రచారాన్ని ప్రారంభించాల్సి ఉంది. అయితే, పది గంటలు దాటినా అభ్యర్థి జాడ కనిపించలేదు.

ప్రచారానికి తానొచ్చినా అభ్యర్థి రాకపోవడంతో మండిపడిన నమిత మరుదుపాండియన్‌లో ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. అక్కడి నుంచి దేవర్ విగ్రహ ప్రాంతంలో ప్రచారానికి వెళ్లారు. అయినా, అభ్యర్థి రాకపోవడంతో పట్టలేని కోపంతో ఆమె ప్రచారాన్ని రద్దు చేసుకుని హోటల్‌కు వెళ్లిపోయారు. సాయంత్రం ప్రచారానికి  రావాలంటూ కార్యకర్తలు ఆమెను కోరినప్పటికీ ‘నో’ చెప్పేశారు. అభ్యర్థి లేకుంటే ప్రచారం చేయబోనని చెప్పడంతో కార్యకర్తలు నిరాశగా వెనుదిరిగారు.