సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

03-04-2021 Sat 07:30
  • మూడు భాషల్లో వస్తున్న 'లవ్ స్టోరీ'
  • చరణ్ క్రేజీ ప్రాజెక్టుకి తమన్ మ్యూజిక్
  • 900 కోట్ల బిజినెస్ చేస్తున్న 'ఆర్ఆర్ఆర్'       
Love story releasing in three languages

*  నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'లవ్ స్టోరీ' చిత్రం ఈ నెల 16న విడుదల అవుతోంది. విశేషం ఏమిటంటే, అదే రోజున ఈ చిత్రం  కన్నడ, మలయాళ అనువాద వెర్షన్లను కూడా విడుదల చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలోని 'సారంగా ధరియా' పాట ఇప్పటికే పెద్ద హిట్టయిన సంగతి విదితమే!      
*  ప్రముఖ దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో రూపొందే భారీ చిత్రానికి సంబంధించిన మరో అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తాడని ఆమధ్య వార్తలొచ్చాయి. అయితే, తాజాగా సంగీత దర్శకుడిగా తమన్ ను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
*  రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోందని సమాచారం. థియేట్రికల్ రైట్స్, డిజిటల్, శాటిలైట్, ఓవర్సీస్.. అన్నీ కలిపి సుమారు 900 కోట్ల బిజినెస్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.