టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు ఏకైక కుమారుడి కన్నుమూత

03-04-2021 Sat 06:58
  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జయరాం
  • తెనాలిలో ఏళ్లపాటు లాయర్‌గా ప్రాక్టీస్
  • చంద్రబాబు సహా టీడీపీ నేతల నివాళి
Yadlapati Jayaram Passed Away

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ యడ్లపాటి వెంకట్రావు ఏకైక కుమారుడు యడ్లపాటి జయరాం కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న గుంటూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.

 న్యాయవాది అయిన జయరాం తెనాలిలో కొన్నేళ్లపాటు లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. తెనాలి బార్ అసోసియేషన్ సభ్యులుగా కొనసాగారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆయన సహ విద్యార్థులే.

జయరాం మృతికి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, పలువురు మాజీ మంత్రులు, నేతలు సంతాపం తెలిపారు. జయరాం మృతదేహానికి నివాళులు అర్పించారు.