రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 8 మంది రిమాండ్ ఖైదీలకు కరోనా

03-04-2021 Sat 06:43
  • గురువారం ముగ్గురికి, నిన్న ఐదుగురికి పాజిటివ్
  • ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
  • మరింతమంది ఖైదీలకు పరీక్షలు
8 remand prisoners got infected to corona in rajamahendravaram central jail

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోని 8 మంది రిమాండ్ ఖైదీలు కరోనా బారినపడ్డారు. గురువారం స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ముగ్గురికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. శుక్రవారం మరో 8 మందికి పరీక్షలు చేయించగా వారిలో ఐదుగురికి పాజిటివ్‌గా తేలినట్టు జైలు సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.

వారిని నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని కొవిడ్ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు ఆయన చెప్పారు. మరింత మంది ఖైదీలకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జైలులో కొవిడ్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తామని పేర్కొన్నారు.