సరికొత్త వాణిజ్య ప్రకటనలో తమన్నాతో మహేశ్ బాబు... వీడియో ఇదిగో!

02-04-2021 Fri 19:04
  • లాయిడ్ ఏసీ కోసం మహేశ్ బాబు కొత్త యాడ్
  • ఈ యాడ్ కోసం మహేశ్ తో జతకట్టిన మిల్కీబ్యూటీ
  • మహేశ్, తమన్నాల మధ్య ఆసక్తికర డైలాగులు
  • సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్న వీడియో
Mahesh Babu and Tamannaah featuring in Lloyd AC ad video

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు వాణిజ్య ప్రకటనలు కొత్త కాదు. అయితే ఈసారి మిల్కీబ్యూటీ తమన్నాతో సరికొత్త యాడ్ లో నటించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని లాయిడ్ ఎయిర్ కండిషనర్ లకు ప్రచారం కల్పిస్తూ మహేశ్, తమన్నాలపై ఈ బుల్లితెర యాడ్ రూపొందించారు. ఇందులో మహేశ్, తమన్నా ఓ జంటగా కనిపిస్తారు. ఇద్దరి మధ్య జరిగే సరదా సంభాషణ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట బాగా సందడి చేస్తోంది.