"లోడు దింపతండాం"... 'పుష్ప' నుంచి ఈ వారం మరిన్ని అప్ డేట్స్ అంటూ మైత్రీ మూవీస్ వెల్లడి

02-04-2021 Fri 18:52
  • బన్నీ, రష్మిక జంటగా 'పుష్ప'
  • సుకుమార్ దర్శకత్వం
  • ఇప్పటికే బన్నీ ఫస్ట్ లుక్ కు అదిరిపోయే స్పందన
  • ఈ వారం అంతా అప్ డేట్స్ వస్తుంటాయన్న నిర్మాణ సంస్థ
Mythri Movie Makers says more updates from Pushpa this week

అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప' చిత్రం నుంచి అప్ డేట్స్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పింది. ఈ వారం 'పుష్ప' చిత్రం నుంచి అనేక అప్ డేట్స్ వస్తున్నాయని, అభిమానులు సిద్ధంగా ఉండాలని వెల్లడించింది. "లోడు దింపతండాం" అంటూ చిత్తూరు యాసలో ఉన్న ఓ పిక్ ను పంచుకుంది. ఈ వారం బన్నీ అభిమానులకు పండగేనని పేర్కొంది.

'పుష్ప' చిత్రంలో బన్నీ ఎర్రచందనం స్మగ్లింగ్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే బన్నీ లుక్ సామాజిక మాధ్యమాల్లో ప్రకంపనలు రేపింది. రఫ్ లుక్ తో ఉన్న స్టయిలిష్ స్టార్ 'పుష్ప' చిత్రంపై భారీగా అంచనాలు పెంచేశాడు.