బన్నీ బర్త్ డేకి అభిమానులకి స్పెషల్ ట్రీట్?

02-04-2021 Fri 17:25
  • అడవి నేపథ్యంలో సాగే కథ
  • గిరిజన యువతిగా రష్మిక
  • ఆగస్టు 13వ తేదీన విడుదల  
A special Treat For Bunny Fans

బన్నీ కథానాయకుడిగా 'పుష్ప' సినిమా రూపొందుతోంది. నవీన్ యెర్నేని - రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ .. లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. అయితే ఆయన స్మగ్లర్ గా మారడం వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుందట. అదేమిటనేది ఇప్పుడు బన్నీ అభిమానులలో ఆసక్తిని రేకేస్తోంది. అడవి నేపథ్యంలో సాగే కథ .. బన్నీ లుక్ ఇప్పటికే అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది.


ఏప్రిల్ 8వ తేదీన బన్నీ పుట్టినరోజు. ఆ రోజున 'పుష్ప' సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను గానీ .. టీజర్ ను గాని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా తప్పకుండా స్పెషల్ ట్రీట్ ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక గిరిజన యువతిగా నటిస్తోంది. ఆమె లుక్ ను చూడాలని కూడా అభిమానులు ఆరాటపడుతున్నారు. జగపతిబాబు .. ప్రకాశ్ రాజ్ .. ఫహద్ ఫాసిల్ .. హరీశ్ ఉత్తమన్ పాత్రలు బలమైన .. వైవిధ్యభరితమైన పాత్రలుగా ఉంటాయని సుకుమార్ చెప్పడం అంచనాలను పెంచుతోంది. ఆగస్టు 13వ తేదీన ఏ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.