KCR: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటమునిగి ఆరుగురి మృతి... దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్

CM KCR shocks after six people drowned in Sriramsagar project
  • ప్రతి శుక్రవారం తెప్ప దీపోత్సవం
  • గోదావరి నది వద్దకు వచ్చిన భక్తులు
  • నీట జారిపోయిన ఇద్దరు చిన్నారులు
  • వారిని కాపాడే ప్రయత్నంలో నలుగురు పెద్దవాళ్లూ గల్లంతు
  • మృతుల కుటుంబాలకు సీఎం సానుభూతి
నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఆరుగురు దుర్మరణం పాలవడం తెలిసిందే. ప్రతి శుక్రవారం ఇక్కడి గోదావరి నదిలో తెప్ప దీపం సమర్పించేందుకు భక్తులు వస్తుంటారు. అయితే పవిత్ర స్నానాల కోసం నదిలో దిగిన సమయంలో ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. వారిని కాపాడే క్రమంలో మరో నలుగురు మునిగిపోయారు.

ఈ ఘటనలో ఆరుగురు మరణించడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్నానం కోసం నదిలో దిగి మృత్యువాత పడడం కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కాగా, ఈ ఘటనలో మృతి చెందినవారిని డి.రాజు, శ్రీనివాస్, సురేశ్, సిద్ధార్థ్, శ్రీకర్, యోగేశ్ గా గుర్తించారు. వీరి మృతితో వారి స్వస్థలాలైన మాక్లూర్, నిజామాబాద్, ఎల్లమ్మగుట్ట, డీకంపల్లి, గుత్స ప్రాంతాల్లో విషాదం నెలకొంది.
KCR
Sriaram Sagar
Drown
Godavari River
Telangana

More Telugu News