నాగార్జున 'వైల్డ్ డాగ్' చిత్రంపై సమంత రివ్యూ

02-04-2021 Fri 16:22
  • నాగార్జున హీరోగా వచ్చిన వైల్డ్ డాగ్ చిత్రం
  • నేడు విడుదల.. సినిమా చూశానన్న సమంత
  • అద్భుతంగా ఉందని కితాబు
  • హాలీవుడ్ స్టయిల్ సినిమా అని వ్యాఖ్యలు
Samantha opines on Nagarjuna Wild Dog movie

నాగార్జున ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మగా నటించిన చిత్రం 'వైల్డ్ డాగ్' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ మూవీపై మీడియాలో రివ్యూలు వెలువడుతున్నాయి. తాజాగా నాగ్ కోడలు, ప్రముఖ నటి సమంత కూడా 'వైల్డ్ డాగ్' చిత్రంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. 'వైల్డ్ డాగ్' చిత్రాన్ని చూశానని, అద్భుతంగా ఉందని కితాబునిచ్చారు.

చాలాకాలంగా యాక్షన్ సినిమాలను మిస్సవుతున్నానని, ఆ లోటును 'వైల్డ్ డాగ్' చిత్రం తీర్చిందని వెల్లడించారు. యాక్షన్, భావోద్వేగాలతో హాలీవుడ్ స్టయిల్లో ఈ సినిమా ఉందని, అన్ని అంశాల కలబోతగా సాగిన ఈ చిత్రాన్ని అందరూ చూడాలని సమంత పిలుపునిచ్చారు. ఇక తన మామగారైన నాగార్జున నటనపై ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్ఐఏ అధికారి విజయ్ వర్మ పాత్రను నాగార్జున తప్ప మరెవ్వరూ పోషించలేరని ఆకాశానికెత్తేశారు. వైల్డ్ డాగ్ చిత్రయూనిట్ కు ఆమె అభినందనలు తెలియజేశారు.