ఎన్నికలు ఆపేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదు: ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్ని

02-04-2021 Fri 13:11
  • ఏపీలోని పార్టీలతో ముగిసిన స‌మావేశం
  • ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందన్న నీలం సాహ్ని
  • గతంలోనే అభ్యర్థుల జాబితా పూర్తయిందని వ్యాఖ్య‌
  • ఎన్నికల నిర్వహణకు స‌హ‌క‌రించాల‌ని పిలుపు
no need to halt election procedure says nilam sawhney

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌ర‌గ‌నున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేప‌థ్యంలో ఏపీలోని పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ఈ స‌మావేశం ముగిసిన‌ అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ...  గతంలోనే అభ్యర్థుల జాబితా పూర్తయిందని చెప్పారు. ఎన్నికలు ఆపేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని తెలిపారు.

ఏపీలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని ఆమె గుర్తు చేశారు. ప‌రిష‌త్‌ ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆమె అన్నారు. అలాగే, ప్ర‌స్తుతం క‌రోనా విజృంభ‌ణ తీవ్ర‌మైన నేప‌థ్యంలో ఎన్నికల ప్రచారంలో ‌ జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. కాగా, ఆమె నిర్వ‌హించిన స‌మావేశానికి వైసీపీ, కాంగ్రెస్‌, సీపీఎం పార్టీల ప్ర‌తినిధులు హాజ‌రుకాగా, టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ నుంచి ఎవ్వ‌రూ హాజ‌రుకాలేదు.