తూర్పు తైవాన్‌లో రైలు ప్ర‌మాదం.. 36 మంది మృతి.. వీడియో ఇదిగో

02-04-2021 Fri 12:51
  • ఈ రోజు ఉద‌యం ప్ర‌మాదం
  • 72 మందికి గాయాలు
  • ప‌ట్టాలు త‌ప్పిన రైలు
  • సొరంగంలో ఇరుక్కుపోయిన వైనం
rail accident in Taiwan

తూర్పు తైవాన్‌లో ఈ రోజు ఉద‌యం ఘోర రైలు ప్రమాదం జ‌రిగి, 36 మంది మృతి చెందారు. ఈ ప్ర‌మాదంలో మ‌రో 72 మందికి గాయాల‌య్యాయి. వారిని సహాయ‌క బృందాలు ఆసుప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్నాయి. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌మాద స‌మ‌యంలో ఆ రైలులో సుమారు 350 మంది ప్రయాణిస్తున్నట్టు అక్క‌డి అధికారులు వివ‌రించారు.  

హువాలియన్‌కు ఉత్తరాన ఉన్న ఒక సొరంగం వ‌ద్ద ఓ ట్రక్ ఒక్క‌సారిగా రైలు పట్టాల పైకి జారిపోయింద‌ని, అదే స‌మ‌యంలో ఆ రైలు ప‌ట్టాల మీదుగా తైటంగ్‌కు ప్రయాణిస్తున్న ఓ రైలు రావ‌డంతో ప‌ట్టాలు త‌ప్పడంతో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంద‌ని అక్క‌డి వార్తా సంస్థ‌లు పేర్కొన్నాయి. ప్ర‌మాదానికి గురైన రైలు సొరంగం మధ్య ఇరుక్కు పోయింద‌ని, దీంతో రక్షణ చర్యలు చేప‌ట్ట‌డానికి స‌హాయక బృందాలు శ్ర‌మించాల్సి వ‌స్తోంద‌ని చెప్పాయి.