ట్విట్టర్ లో చిరంజీవి ఫాలో అవుతున్న ఒకే ఒక్క వ్యక్తి ఎవరో తెలుసా ?

02-04-2021 Fri 11:24
  • సినీ గేయ ర‌చ‌యిత రామ జోగ‌య్య శాస్త్రిని ఫాలో అవుతోన్న చిరు
  • ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటానన్న రామ‌జోగ‌య్య శాస్త్రి
  • కొండంత సంతోషంగా ఉన్నానంటూ ట్వీట్
chiru following ramjogaiah on twitter

ట్విట్టర్ లో మెగాస్టార్ చిరంజీవి ఫాలో అవుతున్న ఒకే ఒక్క వ్యక్తి ఎవరో తెలుసా? ఆయ‌నే సినీ గేయ ర‌చ‌యిత రామ జోగ‌య్య శాస్త్రి. ఈ విషయాన్ని గుర్తించిన ఒక‌రు రామజోగ‌య్య శాస్త్రికి ట్వీట్ చేశారు. 'సర్, మీరు గమనించారో లేదో చిరంజీవి గారు ట్విట్టర్ లో ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి మీరు. మీ సుసంపన్నమైన జ్ఞానానికి అది చిరంజీవి గారు మీకు ఇచ్చిన బహుమతి' అని పేర్కొన్నారు.

ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన రామ జోగ‌య్య శాస్త్రి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 'చిరంజీవి స‌ర్ ప్రేమ‌, ఆశీర్వాదాల‌కు ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను. కొండంత సంతోషంగా ఉన్నాను' అంటూ రామ జోగ‌య్య శాస్త్రి పేర్కొన్నారు. కాగా, చిరు కొత్త సినిమా 'ఆచార్య'కు రామ జోగ‌య్య శాస్త్రి పాట‌లు రాసిన‌ విష‌యం తెలిసిందే.