కాసేప‌ట్లో ఏపీ ఎస్ఈసీ స‌మావేశం.. బ‌హిష్క‌రించిన టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన‌

02-04-2021 Fri 10:35
  • త్వ‌ర‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
  • అఖిల‌ప‌క్ష భేటీ నిర్వ‌హించ‌నున్న ఎస్ఈసీ
  • చర్చించ‌కుండానే షెడ్యూల్ ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల పార్టీల అభ్యంత‌రాలు
tdp will not participate in sec meeting

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌ర‌గ‌నున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేప‌థ్యంలో నేడు ఏపీలోని అన్ని పార్టీలతో ఎన్నిక‌ల సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ప్ర‌క‌టించింది. మ‌రోవైపు, బీజేపీ కూడా ఈ స‌మావేశాన్ని బ‌హిష్క‌రించింది. ఈ స‌మావేశానికి హాజ‌రుకాబోమ‌ని జ‌న‌సేన పార్టీ నిన్న‌నే ప్ర‌క‌టించింది.

ఎన్నికలపై ముందుగా చర్చించ‌కుండానే షెడ్యూల్ ను ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఆయా పార్టీలు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నాయి. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తున్నాయి. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగడానికి వీలుగా కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల‌ని టీడీపీ కోరుతోంది.