సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

02-04-2021 Fri 07:30
  • తమన్నాకు భారీ పారితోషికం
  • నాగ చైతన్యకు జోడీగా రాశిఖన్నా
  • 'సారంగ ధరియా' పాట మరో రికార్డు      
Tamanna charged a bomb for OTT show

*  కథానాయిక తమన్నా అటు సినిమాలు చేస్తూనే.. ఇటు ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఆహా' కోసం 'ఎలెవెన్త్ అవర్' పేరిట ఓ షో చేస్తోంది. దీనికి సంబంధించిన టీజర్ ఇటీవలే రిలీజయింది. ఇక ఈ షో కోసం సదరు ఓటీటీ సంస్థ తమన్నాకి సుమారు 2 కోట్ల మొత్తాన్ని చెల్లిస్తున్నట్టు సమాచారం.
*  'మనం' ఫేమ్ విక్రంకుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా 'థ్యాంక్యూ' పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా తాజాగా రాశిఖన్నాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.  
*  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'లవ్ స్టోరీ' సినిమాలోని 'సారంగ ధరియా' పాట పెద్ద హిట్టయిన సంగతి విదితమే. మంగ్లీ పాడిన ఈ పాటలో కథానాయిక సాయిపల్లవి డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇక యూ ట్యూబ్ లో ఈ పాట తాజాగా 100 మిలియన్ హిట్స్ ను దాటేసి, సరికొత్త రికార్డుల వైపు దూసుకుపోతోంది.