Nagarjuna: చిరంజీవి చేతి వంట రుచి చూసిన నాగార్జున!

Nagarjuna thanked Chiranjeevi for a wonderful dinner
  • శుక్రవారం వైల్డ్ డాగ్ చిత్రం రిలీజ్
  • ప్రమోషన్ ఈవెంట్లతో నాగ్ బిజీ
  • చిరంజీవి నివాసానికి వెళ్లిన వైనం
  • కమ్మని విందు ఏర్పాటు చేసిన మెగాస్టార్
  • కృతజ్ఞతలు తెలిపిన నాగ్
టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ చిత్రం శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నాగార్జున ప్రమోషన్ కార్యక్రమాలలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన తన మిత్రుడు, మెగాస్టార్ చిరంజీవి నివాసానికి విచ్చేశారు. ఇంటికి వచ్చిన అతిథికి చిరంజీవి కమ్మని వంటతో విందు ఏర్పాటు చేశారు.

చిరంజీవి తన కోసం స్వయంగా వంట చేశారని నాగ్ వెల్లడించారు. రేపు వైల్డ్ డాగ్ రిలీజ్ కానుండడంతో కొంచెం ఒత్తిడిలో ఉన్నానని, అయితే ఆ ఒత్తిడిని తొలగించేందుకు మెగాస్టార్ స్వయంగా గరిటె పట్టుకుని వంట చేశారని, రుచికరమైన విందు భోజనం వడ్డించారని నాగ్ వివరించారు. దీనికి సంబంధించిన ఫొటోను కూడా నాగ్ పంచుకున్నారు. ఆ ఫొటోను చిరంజీవి అర్ధాంగి సురేఖ తీశారని తెలిపారు.
Nagarjuna
Chiranjeevi
Dinner
Wild Dog
Surekha
Tollywood

More Telugu News