ఇదో కొత్త నాటకం... అయినా ప్రజలు ఎప్పుడో టీడీపీని బహిష్కరించారు: మంత్రి పేర్ని నాని

01-04-2021 Thu 21:41
  • పరిషత్ ఎన్నికలు బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం!
  • ఇప్పటివరకు నిమ్మగడ్డను అడ్డంపెట్టుకున్నారన్న పేర్ని నాని
  • ఆ ఆటలిక సాగవని తెలుసుకున్నారని వ్యాఖ్యలు
  • లోకేశ్ ను బహిష్కరిస్తే ఫలితం ఉండొచ్చన్న అంబటి
Perni Nani comments on TDP decision to boycott Parishath elections

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయించుకుందన్న వార్తలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. ఇప్పటివరకు నిమ్మగడ్డను అడ్డంపెట్టుకుని ఆటలు ఆడారని, ఇప్పుడు ఆ ఆటలు సాగవని తెలుసుకుని కొత్త నాటకానికి తెరదీశారని విమర్శించారు. అయినా ప్రజలు ఎప్పుడో టీడీపీని బహిష్కరించారని, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అందుకు నిదర్శనం అని పేర్కొన్నారు.

అటు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కూడా టీడీపీపై వ్యాఖ్యలు చేశారు. మీదే ఆలస్యం, మిమ్మల్ని ప్రజలు ఎప్పుడో బహిష్కరించారని ఎద్దేవా చేశారు. ఎన్నికలను బహిష్కరిస్తే మీ పార్టీ బతకదు... లోకేశ్ బాబును బహిష్కరిస్తే ఫలితం ఉండొచ్చని వ్యాఖ్యానించారు.