రజనీకాంత్ కు కేంద్రం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తెలుగు నిర్మాతల మండలి

01-04-2021 Thu 21:01
  • రజనీకాంత్ కు దాదాసాహెబ్ పురస్కారం
  • స్పందించిన తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి
  • ప్రకటన విడుదల చేసిన గౌరవ కార్యదర్శులు
  • రజనీకాంత్ కు హృదయపూర్వక అభినందనలు తెలిపిన మండలి
Telugu Film Producers Council heaps praise on Rajinikanth after Centre announced Dadasaheb Phalke

దక్షిణాది సూపర్ స్టార్, విదేశాల్లో సైతం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంటున్న తలైవా రజనీకాంత్ ను కేంద్రం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంతో గౌరవించడం పట్ల తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి స్పందించింది. తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున సూపర్ స్టార్ రజనీకాంత్ కు హృదయపూర్వక అభినందనలు అంటూ నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శులు టి.ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల ఓ ప్రకటన విడుల చేశారు.

రజనీకాంత్ కు 2020 ఏడాదికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించడం హర్షణీయమని పేర్కొన్నారు. ఆయన భారత్, జపాన్, సింగపూర్, మలేషియా తదితర దేశాల్లో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నారని, భారత కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ద్వారా ఆయనను మరింత గౌరవించిందని వివరించారు.