శత్రువునైనా ప్రేమించమనే క్రీస్తు సందేశం ఆదర్శనీయం: సీఎం కేసీఆర్ గుడ్ ఫ్రైడే సందేశం

01-04-2021 Thu 20:32
  • రేపు గుడ్ ఫ్రైడే
  • క్రైస్తవులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
  • క్రీస్తు విశిష్టతలను కొనియాడిన వైనం
  • జీసస్ బోధనల్లో మానవీయత ఉందని వెల్లడి
CM KCR wishes christian people for Good Friday

రేపు గుడ్ ఫ్రైడే పర్వదినం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా వ్యాప్తి ఇంకా తొలగిపోనందున, క్రైస్తవులు అన్ని జాగ్రత్తలు తీసుకుని గుడ్ ఫ్రైడే వేడుకలు జరుపుకోవాలని సూచించారు.

క్రీస్తు కరుణామయుడని, ఆయన పాటించిన సహనం, ప్రేమ, దయ, శాంతి, త్యాగం వంటి విలువలు, శత్రువునైనా ప్రేమించమనే ఆదర్శం యావత్ మానవాళి అనుసరించదగ్గవని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జీసస్ అందించిన శాంతి సందేశాన్ని ప్రజలు మరోసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆయన బోధనల్లో మానవీయత ఉందని కొనియాడారు.

కేంద్రం అవార్డులు వచ్చాయంటే సీఎం కేసీఆర్ ఘనతే: ఎర్రబెల్లి దయాకర్ రావు

కేంద్రం ప్రకటించే దీన్ దయాళ్ సశక్తికరణ్ అవార్డుల్లో తెలంగాణకు 12 అవార్డులు లభించడం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. దేశంలోనే అత్యుత్తమ జిల్లా కేటగిరీలో ఒక అవార్డు, అత్యుత్తమ మండల పరిషత్ కేటగిరీలో 2 అవార్డులు, అత్యుత్తమ పంచాయతీ విభాగంలో 9 అవార్డులు తెలంగాణకు లభించాయని ఎర్రబెల్లి వివరించారు. ఈ అవార్డులు రావడానికి సీఎం కేసీఆర్ పాలన, చేస్తున్న అభివృద్ధే కారణమని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి జాతీయస్థాయికి చేరిందంటే అది సీఎం కేసీఆర్ కృషి, దార్శనికత ఫలితమేనని కొనియాడారు.