యూట్యూబ్ చానల్లో 'వైల్డ్ డాగ్' సినిమా అప్ లోడ్ చేశారంటూ కలకలం రేపిన మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్!

01-04-2021 Thu 19:23
  • నాగార్జున హీరోగా 'వైల్డ్ డాగ్' చిత్రం
  • ట్వీట్ చేసిన మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్
  • ఏప్రిల్ 1 నాడు జనాలను ఫూల్ చేసే ప్రయత్నం
  • అదే వరుసలో ప్రచారానికి యత్నం
Matinee Entertainment funny tweet on Wild Dog movie release

నాగార్జున, సయామీ ఖేర్, దియా మీర్జా, అలీ రెజా తదితరులు నటించిన యాక్షన్ మూవీ 'వైల్డ్ డాగ్' రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే 'వైల్డ్ డాగ్' చిత్ర నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ వినూత్నంగా ప్రచారం చేపట్టింది. ఎవరో తమ యూట్యూబ్ చానల్లో 'వైల్డ్ డాగ్' చిత్రం మొత్తాన్ని అప్ లోడ్ చేశారని, అయితే యూట్యూబ్ లో ఎవరూ చూడొద్దని విజ్ఞప్తి చేసింది. రేపు థియేటర్లలోనే చూడాలని సూచించింది. అంతేకాదు, తమ యూట్యూబ్ చానల్ లింకును కూడా పంచుకుంది.

అయితే ఆ లింకు ఓపెన్ చేస్తే "వైల్డ్ డాగ్... ఇన్ థియేటర్స్ టుమారో" అనే సందేశం కనిపిస్తోంది. ఆ వీడియో నిడివి 2 గంటల 9 నిమిషాలు కాగా, మొదటి నుంచి చివరివరకు ఇదే సందేశం దర్శనమిస్తోంది. దాంతో మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ జనాలను ఏప్రిల్ ఫూల్ చేయడంతో పాటు, తమ చిత్రానికి వినూత్న రీతిలో ప్రచారం కల్పించినట్టయింది.