Nara Lokesh: జగన్ నాటకపు మోసాలు సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నాం... మీరూ చూడండి: నారా లోకేశ్

Nara Lokesh shares video containing YS Jagan comments
  • జగన్ వ్యాఖ్యల వీడియో పంచుకున్న లోకేశ్
  • జగన్ అందరినీ ఏప్రిల్ ఫూల్ చేశాడని వ్యాఖ్యలు
  • హోదా అంశాన్ని కేసుల కోసం తాకట్టుపెట్టాడని ఆరోపణ
  • కులపత్రికలో ఏప్రిల్ ఫూల్ వార్తలు రాయిస్తున్నాడని వెల్లడి
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని తన కేసుల కోసం తాకట్టు పెట్టాడని, బాబాయి హత్యకేసును నీరుగార్చాడని, సీపీఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులకు మాటిచ్చి తప్పాడని, మొత్తంగా ఏపీనే ఏప్రిల్ ఫూల్ చేశాడని పేర్కొన్నారు. జనాల్ని తప్పుదారి పట్టించేందుకు కొందరు ఫూల్స్ తో తన కులపత్రికలో ఏప్రిల్ ఫూల్ వార్తలు రాయిస్తున్న ఫేక్ సీఎం జగన్ రెడ్డి అంటూ మండిపడ్డారు.

జగన్ రెడ్డి నాటకపు మోసాల సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నాం, మీరూ చూడండి అంటూ ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలో జగన్ గతంలో ప్రత్యేక హోదా, వివేకా హత్య కేసు, పోలవరం తదితర అంశాల్లో ఏమన్నారో క్లిప్పింగ్స్ రూపంలో ప్రదర్శించారు.

"గాలి హామీలతో గద్దెనెక్కిన గాలి మాటల ముఖ్యమంత్రి గాల్లో మేడలు కట్టి జనాలను ఏప్రిల్ ఫూల్ చేశాడు. పార్టీ పేరులో ఉన్న యువజన, శ్రామిక, రైతుల్ని మోసం చేశాడు. అవ్వాతాతలకు కూడా అన్యాయం చేశాడు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా చేశాడు" అంటూ మండిపడ్డారు.
Nara Lokesh
Jagan
Video
Cinema
April 1st
Andhra Pradesh

More Telugu News