Stock Market: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

  • నేడు ఆర్థిక సంవత్సరం తొలిరోజు
  • ఉత్సాహ భరిత వాతావరణంలో లావాదేవీలు
  • లాభాల బాటలో మెటల్ షేర్లు
  • నష్టాలు చవిచూసిన హెచ్ డీఎఫ్ సీ, నెస్లే ఇండియా
Stock Markets ended with profits on new financial year opening day

నేడు ఆర్థిక సంవత్సరం తొలిరోజు కాగా, భారత స్టాక్ మార్కెట్లు ఉత్సాహభరిత వాతావరణంలో లావాదేవీలు కొనసాగించాయి. సెన్సెక్స్ 520.68 పాయింట్ల లాభంతో 50,029.83 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా అదే బాటలో 176.70 పాయింట్ల వృద్ధితో 14,867.40 వద్ద స్థిరపడింది. నేటి ట్రేడింగ్ లో 2,120 షేర్లు ముందంజ వేయగా, 727 షేర్లు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాయి. 143 షేర్లు తటస్థంగా నిలిచాయి.

నిఫ్టీలో హిండాల్కో, జేఎస్ డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, అదాని పోర్ట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లాభాల బాటలో పయనించగా, నెస్లే ఇండియా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ ఇన్సూరెన్స్, టీసీఎస్, హిందూస్థాన్ యూనీలీవర్ షేర్లు నష్టాలు చవిచూశాయి. ఎఫ్ఎంసీజీ షేర్లకు కూడా నష్టాలు తప్పలేదు. మెటల్, ఆర్థిక సంస్థల షేర్ల అండతో దేశీయ మార్కెట్లు లాభాలు అందుకున్నాయి.

More Telugu News