Centre: 2020-21లో రాష్ట్రాలకు చెల్లించాల్సిన అదనపు నిధుల వివరాలు వెల్లడించిన కేంద్రం

  • పన్నుల వాటా కింద రూ.45 వేల కోట్లు కేటాయింపు
  • రాష్ట్రాలకు అదనంగా 8.2 శాతం చెల్లిస్తున్నామన్న కేంద్రం
  • ఏపీకి అదనంగా రూ.1,850 కోట్లు
  • తెలంగాణకు అదనంగా రూ.960 కోట్లు
Centre reveals the details of additional allocations for states

రాష్ట్రాలకు కేటాయించిన అదనపు నిధుల వివరాలను కేంద్రం వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రాలకు పన్నుల వాటా కింద రూ.45 వేల కోట్లు అదనంగా కేటాయించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. పన్నులు, సుంకాల కింద రాష్ట్రాలకు ఇచ్చే నిధుల వాటాకు అదనంగా 8.2 శాతం నిధులు కేటాయించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది.

2020-21లో ఏపీకి రూ.22,611 కోట్లు చెల్లించాల్సి ఉండగా అదనపు నిధులతో కలిపి రూ.24,461 కోట్లు చెల్లించినట్టు వెల్లడించింది. ఆ లెక్కన ఏపీకి రూ.1,850 కోట్లు అదనంగా చెల్లించినట్టు వివరించింది. అదే ఏడాదికి సంబంధించి తెలంగాణకు రూ.11,732 కోట్లు చెల్లించాల్సి ఉండగా, అదనపు నిధులు రూ.960 కోట్లతో కలిపి రూ.12,692 కోట్లు చెల్లించినట్టు పేర్కొంది.

ఇక, ఇతర రాష్ట్రాలతో పోల్చితే కేంద్రం ఉత్తరప్రదేశ్, బీహార్ లకు అత్యధిక మొత్తంలో అదనపు నిధులను కేటాయించింది.

More Telugu News