గ‌వ‌ర్న‌ర్‌తో ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్ని భేటీ.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై చ‌ర్చ‌

01-04-2021 Thu 13:12
  • ఈ రోజే బాధ్య‌త‌లు స్వీక‌రించిన నీలం సాహ్ని
  • అనంత‌రం రాజ్‌భవ‌న్‌కు ఎస్ఈసీ
  • మ‌ర్యాద‌పూర్వ‌కంగా గ‌వర్న‌ర్‌ను క‌లిసిన నీలం సాహ్ని
neelam sahni meets governer

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఎన్నికల కమిషనర్‌గా‌ నీలం సాహ్ని విజయవాడలోని కార్యాలయంలో బాధ్య‌త‌లు స్వీక‌రించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆమె రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లి ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో మర్యాదపూర్వకంగా స‌మావేశ‌మ‌య్యారు.  ఈ సందర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిర్వ‌హించాల్సిన‌ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై గవర్నర్‌తో ఆమె చర్చించారు.

నిన్న‌ ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పదవీకాలం ముగిసింది. ఇటీవ‌ల ఏపీలో గ్రామ పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికలను ఆయ‌న పూర్తి చేశారు. అయితే, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వ‌హించాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఈ అంశంపై నీలం సాహ్ని దృష్టి సారించారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజల సహకారంతో ‌ ఎన్నికలు పూర్తి చేస్తామని ఆమె అన్నారు. ఆమె ఏపీ తొలి మహిళా ఎస్‌ఈసీగా గుర్తింపు పొందారు.