Russia: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జంతువులకు కరోనా వ్యాక్సిన్ తీసుకువచ్చిన రష్యా

  • ఏడాదిన్నరగా కరోనా వ్యాప్తి
  • జంతువులకు సోకుతున్న కరోనా
  • జంతువుల్లో వైరస్ రూపాంతరం
  • మరింత ప్రమాదకరంగా మారి మనుషులకు సోకే అవకాశం
  • తమ వ్యాక్సిన్ వైరస్ ను కట్టడి చేస్తుందన్న రష్యా
Russia brings corona vaccine for animals for the first time in ther world

గత ఏడాదిన్నర కాలంగా ప్రపంచ మానవాళిని అట్టుడికిస్తున్న కరోనా రక్కసిని కట్టడి చేసేందుకు అనేక వ్యాక్సిన్లు వచ్చాయి. అయితే అవన్నీ మనుషులకే. కాగా, రష్యా మొట్టమొదటిసారిగా జంతువులకు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకువచ్చింది. ఈ వ్యాక్సిన్ పేరు కార్నివాక్-కోవ్. ఈ వ్యాక్సిన్ ను అగ్రికల్చరల్ రెగ్యులేటరీలో నమోదు చేశారు. క్లినికల్ ట్రయల్స్ లో ఇది కుక్కలు, పిల్లులు, నక్కలు, మింక్స్ వంటి జంతువుల్లో యాంటీబాడీలను ఉత్పత్తి చేసినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నుంచి ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయనున్నారు.

మనుషులు, జంతువుల మధ్య కరోనా వైరస్ వ్యాప్తిపై ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై రష్యా అగ్రికల్చరల్ రెగ్యులేటరీ స్పందిస్తూ, జంతువుల్లో కరోనా వ్యాప్తిని ఈ వ్యాక్సిన్ అరికడుతుందని, ప్రమాదకరమైన ఉత్పరివర్తనాల నుంచి కరోనా కొత్త వేరియంట్లు తయారుకాకుండా అడ్డుకుంటుందని వివరించింది. కరోనా వ్యాప్తి మొదలయ్యాక ప్రపంచవ్యాప్తంగా జంతువులు కూడా కరోనా బారిన సంఘటనలు జరిగాయి.

More Telugu News