PLI Scheme: ఆహారశుద్ధి రంగానికి కేంద్రం రూ.10,900 కోట్ల ప్రోత్సాహకాలు!

  • పీఎల్ఐ పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం
  • 2.5 లక్షల ఉద్యోగాలు రానున్నట్లు అంచనా
  • ఎగుమతులు సైతం భారీగా పెరిగే అవకాశం
  • ఇప్పటి వరకు ఆరు రంగాలకు పీఎల్‌ఐ వర్తింపు
Centre approves PLI Scheme for Food processing industry

ఆహారశుద్ధి రంగానికి రూ.10,900 కోట్ల మేర ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని(పీఎల్‌ఐ) కేంద్రం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. దీనివల్ల దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు రానున్నట్లు అంచనా వేశారు. ఎగుమతులు సైతం భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ నిర్ణయం దేశ రైతులకు లబ్ధి చేకూరుస్తుందని కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 12-13 రంగాలకు పీఎల్‌ఐ పథకాన్ని ప్రకటిస్తున్నట్లు బడ్జెట్‌లో తెలపగా.. ఇప్పటికే ఆరు రంగాలకు వర్తింపజేసినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు.

More Telugu News