Nara Lokesh: దాడిలో మరణించిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.6 లక్షల ఆర్థికసాయం అందించిన నారా లోకేశ్

Nara Lokesh handed over cash cheque to a party worker family
  • సత్తెనపల్లి నియోజకవర్గంలో కృష్ణారావు అనే కార్యకర్త మృతి
  • వైసీపీ గూండాలే చంపారంటూ టీడీపీ ఆరోపణ
  • కృష్ణారావుకు లోకేశ్ నివాళి
  • కుటుంబ సభ్యులకు పరామర్శ
  • సైకోరెడ్డికి వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్
సత్తెనపల్లి నియోజకవర్గం లక్కరాజుగార్లపాడు గ్రామంలో ఇటీవల జరిగిన దాడిలో  గరికపాటి కృష్ణారావు అనే టీడీపీ కార్యకర్త మృతి చెందాడు. అయితే వైసీపీ శ్రేణుల దాడుల్లోనే కృష్ణారావు మరణించాడని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించారు.

లక్కరాజుగార్లపాడులో కృష్ణారావుకు నివాళులు అర్పించి, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా లోకేశ్ ఆ కార్యకర్త కుటుంబానికి టీడీపీ తరఫున రూ.6 లక్షల ఆర్థికసాయం అందించారు. దీనిపై లోకేశ్ ట్విట్టర్ లో వెల్లడించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తూ రాక్షసానందం పొందుతున్న సైకో రెడ్డికి అన్నీ వడ్డీతో సహా చెల్లిస్తామని వ్యాఖ్యానించారు.
Nara Lokesh
Party Worker
Sattenapalle
Telugudesam
Andhra Pradesh

More Telugu News