Tea: టీ పొడి అనుకుని విష గుళికలు కలిపిన వైనం... మహిళ మృతి

Poisonous tea kills woman in Janagama district
  • జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో ఘటన
  • ఉదయం టీ కలిపిన అంజమ్మ అనే మహిళ
  • భర్త, మరిదితో కలిసి టీ తాగిన వైనం
  • కాసేపట్లోనే వారిపై విష ప్రభావం
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి

తెలంగాణలోని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో విషాదం నెలకొంది. టీ పొడికి బదులు విషపు గుళికలు కలిపిన టీ తాగి అంజమ్మ అనే మహిళ మృతి చెందింది. దాసారం మల్లయ్య, అంజమ్మ దంపతులు. ఎప్పట్లాగానే ఉదయం టీ తాగారు. అయితే, అంజమ్మ పొరబాటున టీ పొడికి బదులు విషపు గుళికలు కలిపింది.

ఆ టీ తాగిన అంజమ్మ ప్రాణాలు కోల్పోగా, ఆమె భర్త మల్లయ్య, మరిది భిక్షపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తేనీరు సేవించిన కొన్ని నిమిషాల్లోనే వారిపై విష ప్రభావం కనిపించింది. వీరిని జనగామ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అంజమ్మ మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News