Radha Ravi: నయనతారతో ఉదయనిధి స్టాలిన్ సహజీవనం చేస్తున్నాడు: రాధారవి

Nayanathara and Udayanidhi are in living relationship says Radha Ravi
  • వివాదాస్పద వ్యాఖ్యలతో పతాకశీర్షికల్లో రాధారవి
  • కమలహాసన్ ను కూడా వదిలిపెట్టని వైనం
  • ముగ్గురు పెళ్లాలను కాపాడుకోలేని కమల్.. రాష్ట్రాన్ని ఏం కాపాడతారని వ్యాఖ్య
ప్రముఖ తమిళ సినీ నటుడు రాధారవి ఎప్పుడూ ఏదోఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ పతాక శీర్షికల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే ఆయన చేసిన పలు వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్, సినీ నటి నయనతార గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నయనతారతో ఉదయనిధి స్టాలిన్ సహజీవనం చేస్తున్నాడని ఆయన అన్నారు. అయినా, ఇలాంటివి తాను పట్టించుకోనని చెప్పారు.

ఈ వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక డీఎంకే శ్రేణులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఉదయనిధి కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

మరోవైపు, కమలహాసన్ ను కూడా రాధారవి వదిలిపెట్టలేదు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి కామెంట్ చేశారు. ముగ్గురు భార్యలను కాపాడుకోలేకపోయిన కమల్... రాష్ట్రాన్ని ఏం కాపాడతారని ఆయన విమర్శించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాధారవి వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
Radha Ravi
Nayanthara
Udayanidhi Stalin
Kamal Haasan

More Telugu News