Kanakadurga Temple: విజయవాడ దుర్గ గుడిలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

Vigilance officers search in Vijayawada Kanakadurga Temple
  • ఇప్పటికే ఇంద్రకీలాద్రిపై ఏసీబీ దాడులు 
  • తాజాగా విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు
  • సెక్యూరిటీ, శానిటరీ టెండర్లలో అవినీతిపై ఆరోపణలు
  • ఈవో నుంచి వివరాలు సేకరించిన విజిలెన్స్ అధికారులు
బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో అవినీతి, అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆలయ అన్నదాన విభాగంలోనూ, స్టోర్స్, అమ్మవారి చీరల విభాగంలోనూ అధికారులు ఫైళ్లను పరిశీలించారు.

ఆలయ ఈవో సురేశ్ బాబు నుంచి వివరాలు సేకరించారు. సెక్యూరిటీ, శానిటరీ టెండర్లలో అవకతవకలు జరిగినట్టు విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదులు అందాయి. ఇప్పటికే దుర్గగుడిలో తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు అనేక అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో 15 మంది ఆలయ ఉద్యోగులు సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే.
Kanakadurga Temple
Vijayawada
Vigilance
Search
Andhra Pradesh

More Telugu News