Team India: టీమిండియా మాజీ క్రికెటర్‌ అశోక్ దిండాపై రాళ్లదాడి

Ex cricketer Ashok Dinda attacked in West Bengal
  • మొయినా నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దిండా
  • ప్రచారం నిర్వహిస్తుండగా దాదాపు 50 మంది దాడి
  • దాడిలో తీవ్రంగా గాయపడ్డ దిండా
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ, టీఎంసీ వర్గీయుల మధ్య పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ అశోక్ దిండాపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. మొయినా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా దిండా పోటీ చేస్తున్నారు. ఆయన ప్రచారం నిర్వహిస్తుండగా దాదాపు 50 మంది...  గుంపుగా వచ్చి వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో దిండాకు తీవ్రగాయాలయ్యాయి.

ఈ ఘటన నేపథ్యంలో అధికార టీఎంసీపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ దాడికి పాల్పడింది టీఎంసీ వర్గీయులేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే బీజేపీ నేతల ఆరోపణలను టీఎంసీ ఖండించింది. బీజేపీ నేతలే తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించింది.
Team India
Ashok Dinda
West Bengal
Attack
BJP

More Telugu News