A Raja: కేంద్ర మాజీ మంత్రి రాజాకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీస్ జారీ

EC Issue Showcause notice to A Raja
  • ఈపీఎస్‌పై రాజా అభ్యంతరకర వ్యాఖ్యలు
  • ఈసీకి ఫిర్యాదు చేసిన అన్నాడీఎంకే
  • నేటి సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశం
ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అన్నాడీఎంకే నేతల ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. నేటి సాయంత్రం ఆరు గంటల్లోగా నోటీసుకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

 సీఎం ఈపీఎస్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, మహిళల మాతృత్వ గౌరవాన్ని తగ్గించినట్టుగా ఉన్నాయని ఈసీ ఆ నోటీసులో పేర్కొంది. ఆ వ్యాఖ్యలు కచ్చితంగా ఎన్నికల నిబంధన ఉల్లంఘన కిందికే వస్తాయని, వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఇటీవల థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసిన రాజా.. సీఎంను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో అధికారపార్టీ నేతలు రాజాపై ఈసీకి ఫిర్యాదు చేశారు. కాగా, పళనిస్వామిపై చేసిన వ్యాఖ్యలకు రాజా ఇప్పటికే క్షమాపణలు తెలిపారు.
A Raja
AIADMK
DMK
EC
Edappadi Palaniswami
Tamil Nadu

More Telugu News