Kodali Nani: చంద్రబాబు ఆ పని చేసుంటే టీఆర్ఎస్ ఉండేదే కాదు: కొడాలి నాని కీలక వ్యాఖ్యలు!

Kodali Nani Latest Comments on Chandra Babu and KCR
  • కేసీఆర్ కు మంత్రి పదవి ఇవ్వని చంద్రబాబు
  • ఇచ్చుంటే ఏపీ విడిపోయేది కాదు
  • చంద్రబాబును నిమ్మగడ్డ కూడా కాపాడలేకపోయారన్న నాని
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడేనని, ఆయన సీఎంగా ఉన్న వేళ, కేసీఆర్ ను మంత్రి వర్గంలోకి తీసుకుని ఉంటే, ఆయన పార్టీని పెట్టేవారు కాదని, విభజన కూడా జరిగి ఉండేది కాదని ఏపీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం భూమిని అమ్మితే, ఏపీలో మూడు ఎకరాలు కొనవచ్చని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బాబే కారణమని మండిపడ్డారు.

తాజాగా, వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కొడాలి నాని, ఏపీలో ఎకరం భూమి విలువ రూ. 10 లక్షలకు పడిపోయిందని, అందుకు కూడా చంద్రబాబు గత విధానాలే కారణమని, ఆయన పార్టీని ఎస్ఈసీ నిమ్మగడ్డ కూడా కాపాడలేకపోయారని సెటైర్లు వేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రూ. 3.60 లక్షల కోట్ల అప్పులను తీసుకుని రాలేదా? అని ప్రశ్నించిన ఆయన, త్వరలో తిరుపతిలో జరిగే ఉప ఎన్నికల్లో వైసీపీ ఐదు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించనుందని జోస్యం చెప్పారు.
Kodali Nani
Chandrababu
TRS
KCR

More Telugu News