US Neulier Command: యూఎస్ నూక్లియర్ కమాండ్ ఖాతా నుంచి ట్వీట్... కలకలం రేపిన కోడ్!

  • యూఎస్ నూక్లియరల్ ఖాతాలో ట్వీట్ కలకలం
  • వివరణ ఇచ్చిన ఉన్నతాధికారులు
  • ట్విట్టర్ ఖాతాను హ్యాండిల్ చేస్తున్న స్ట్రాట్ కామ్
  • ఓ బాలుడు చేసిన పనేనట
Tweet From US Nuclier Command Center Goes Viral

అది అమెరికాలో అత్యంత శక్తిమంతమైన యూఎస్ నూక్లియర్ కమాండ్ సెంటర్ వినియోగించే ట్విట్టర్ ఖాతా. దానిలో నుంచి ";l;;gmlxzssaw," అని ఓ వింత మెసేజ్ ట్వీట్ కావడం కలకలం రేపింది. దేశంలోని అణ్వాయుధాలను నిర్వహించే విభాగం నుంచి ఈ ట్వీట్ రావడంతో పెంటగాన్ హ్యాక్ అయిందా? అని కొందరు, ఇదేమైనా 'యూఎస్ న్యూక్లియర్ లాంచ్ కోడా?' అని మరికొందరు రిప్లయ్ ట్వీట్లు పెట్టారు. ఇక ఈ ట్వీట్ వైరల్ కావడంతో అధికారులు వివరణ ఇచ్చారు.

ఈ ట్వీట్ లో ఎటువంటి సీక్రెట్ మెసేజ్ లేదని చెబుతూ, అసలు విషయంపై యూఎస్ మిలిటరీ స్ట్రాటజిక్ విభాగం ట్విట్టర్ ఖాతాను నిర్వహించే స్ట్రాట్ కామ్ వివరణ ఇచ్చింది. నెబ్రాస్కా కేంద్రం ఆఫట్ ఎయిర్ ఫోర్స్ బేస్ హెడ్ క్వార్టర్స్ గా ఉన్న స్ట్రాట్ కామ్ ఈ ఖాతాను నిర్వహిస్తుంది. ఇక ఈ ఎయర్ ఫోర్స్ బేస్ అమెరికాపై జరిగే ఇతర దేశాల మిసైల్ దాడులను ఎదుర్కొనేందుకు అనుక్షణం సిద్ధంగా ఉంటుంది.

ఇంతకీ ఏమైందంటే, ప్రస్తుతం మైఖేల్ తాలెన్ అనే వ్యక్తి, స్ట్రాట్ కామ్ సోషల్ మీడియా ఎడిటర్ గా పనిచేస్తూ, కరోనా కారణంగా ఇంటి నుంచి పని చేస్తున్నారు. అతను ఇంట్లో ఈ ఖాతాను ఓపెన్ చేసి, మరో పని నిమిత్తం వెళ్లిన వేళ, అతని కుమారుడు కీ బోర్డ్ పై ఉన్న కీస్ తో ఆటలాడాడు.

అదే సమయంలో కొన్ని కీస్ కొట్టి, ఎంటర్ చేయడంతో అవి ట్విట్టర్ ఖాతాలో అప్ లోడ్ అయ్యాయి. అంతకుమించి ఇంకేమీ లేదని స్టార్ట్ కామ్ అధికారి కెండాల్ కూపర్ వెల్లడించారు. తొలి ట్వీట్ వచ్చిన తరువాత కలకలం రేగగా, ఆపై దాదాపు అరగంట తరువాత వివరణ వచ్చింది. దాని తరువాత ఈ రెండు ట్వీట్లనూ స్ట్రాట్ కామ్ డిలీట్ చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News