Deepika Padukone: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Deepika ready to allot bulk dates to Prabhas movie
  • ప్రభాస్ సినిమాకు దీపిక బల్క్ డేట్స్ 
  • ఎన్టీఆర్ చిత్రానికి పరిశీలనలో కొత్త టైటిల్ 
  • మరింత ముందుకెళ్లిన 'సీటీమార్'  
*  ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందే భారీ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే. జూన్ నుంచి ఈ చిత్రం షూటింగును హైదరాబాదులో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం కోసం బల్క్ డేట్స్ అవసరం కావడంతో ఇవ్వడానికి దీపిక అంగీకరించినట్టు తెలుస్తోంది. హిందీ సినిమాల డేట్స్ అడ్జస్ట్ చేసుకుని ఈ చిత్రానికి డేట్స్ ఇస్తోందట.
*  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడుగా పాన్ ఇండియా మూవీని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి విదితమే. మొదటి నుంచీ దీనికి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే పేరును వర్కింగ్ టైటిల్ గా వాడుతున్నారు. అయితే, తాజాగా 'చౌడప్ప నాయుడు' అనే టైటిల్ని నిర్ణయించినట్టు  తెలుస్తోంది.
*  గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న 'సీటీమార్' చిత్రం విడుదల వాయిదా పడింది. ఏప్రిల్ 2న విడుదల కావలసిన ఈ చిత్రాన్ని గ్రాఫిక్ వర్క్స్ పూర్తికానందున ఏప్రిల్ 30న రిలీజ్ చేయడానికి నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో తమన్నా కథానాయికగా నటించింది.
Deepika Padukone
Prabhas
NTR
Tamannaah

More Telugu News