Ram Nath Kovind: రాష్ట్రపతి కోవింద్ కు బైపాస్ సర్జరీ విజయవంతం

President Kovind undergoes bypass surgery
  • ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ
  • ట్విట్టర్ ద్వారా వెల్లడించిన రాజ్ నాథ్ సింగ్
  • త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష  
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు వైద్యులు బైపాస్ సర్జరీ నిర్వహించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆయనకు విజయవంతంగా శస్త్ర చికిత్సను నిర్వహించారు. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

'భారత రాష్ట్రపతికి ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో బైపాస్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఆపరేషన్ ను విజయవంతం చేసిన వైద్య బృందాన్ని అభినందిస్తున్నా. రాష్ట్రపతిగారి ఆరోగ్యం గురించి ఎయిమ్స్ డైరెక్టర్ తో మాట్లాడాను. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను' అని రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.

ఛాతీలో ఇబ్బందుల కారణంగా గత శుక్రవారం ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో కోవింద్ చేరారు. అదే రోజు ఆయనను రాజ్ నాథ్ సింగ్ పరామర్శించారు. ఆ మరుసటి రోజు (శనివారం) రాష్ట్రపతిని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
Ram Nath Kovind
President Of India
Bypass Surgery
Raj Nath Singh
BJP

More Telugu News