China: హాంకాంగ్‌పై ప‌ట్టు కోసం చైనా మ‌రో కీల‌క చ‌ర్య!‌

  • హాంకాంగ్ చ‌ట్ట‌స‌భ‌లో ప్ర‌త్య‌క్ష ఎన్నిక స‌భ్యుల సంఖ్య‌ త‌గ్గింపు
  • ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 70 మంది స‌భ్యులు
  • వారిలో 35 మంది ప్ర‌త్య‌క్షంగా ఎన్నిక
  • 20కి త‌గ్గించిన చైనా  
 China takes one more decision on Hong Kong

హాంకాంగ్‌పై ప‌ట్టు కోసం చైనా మ‌రో కీల‌క చ‌ర్య తీసుకుంది. హాంకాంగ్ చ‌ట్ల‌స‌భ‌లో ప్ర‌త్య‌క్ష ఎన్నిక స‌భ్యుల సంఖ్య‌ను త‌గ్గించింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 70 మంది స‌భ్యులు హాంకాంగ్‌ చ‌ట్ట‌స‌భ‌లో ఉన్నారు. వారిలో 35 మంది ప్ర‌త్య‌క్షంగా ఎన్నిక‌వుతుంటారు.

హాంకాంగ్‌పై ప‌ట్టు కోసం చ‌ట్ట‌స‌భ‌లో స‌భ్యుల సంఖ్య‌ను 90కి పెంచింది చైనా. అలాగే, ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ స‌భ్యుల సంఖ్య‌ను 35 నుంచి 20కి త‌గ్గించింది. తద్వారా హాంకాంగ్ ప్ర‌జ‌లు ఎన్నుకున్న స‌భ్యులు కాకుండా త‌మకు అనుకూలంగా ఉండేవారిని చ‌ట్ట‌స‌భ‌ల‌కు పంపాల‌న్న‌ది చైనా వ్యూహంగా క‌న‌ప‌డుతోంది.

కాగా, హాంకాంగ్‌పై  పెత్తనం చెలాయించేందుకు వివాదాస్పద జాతీయ భద్రతా బిల్లును చైనా పార్లమెంట్ గ‌తంలో ఏకగ్రీవంగా ఆమోదించిన విష‌యం తెలిసిందే. దాని ద్వారా హాంకాంగ్‌ ప్రాదేశిక స్వతంత్ర ప్రతిపత్తి, పౌరుల‌ ప్రాథమిక హక్కులను చైనా కాల‌రాసే అవ‌కాశం ఉంద‌ని అప్ప‌ట్లో తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇప్పుడు చైనా మ‌రో చ‌ర్య తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

More Telugu News