girl: వంద రోజుల త‌ర్వాత ఖమ్మం బాలిక ఆచూకీ గుర్తింపు.. పూజారి తీసుకెళ్లిన‌ట్లు తేల్చిన పోలీసులు

  • ఖ‌మ్మం జిల్లా ఎర్లు పాలెంలోని రేమిడిచ‌ర్ల‌కు చెందిన బాలిక  
  • క్షుద్ర‌పూజ‌ల ఉదంతంతో అదృశ్య‌మైన బాలిక 
  • ఉత్త‌ర ప్ర‌దేశ్ లో బాలిక ఆచూకీ ల‌భ్యం
  • మాయ‌మాట‌లు చెప్పి బాలిక‌ను తీసుకెళ్లిన‌ట్లు పోలీసుల వెల్ల‌డి 
  • బాలిక మేనమామ ఇంట్లో క్షుద్ర‌పూజ‌ల  కోసం పెద్ద‌గొయ్యి
Missing girls traced in UP

గత ఏడాది డిసెంబర్ 17న  ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక కిడ్నాప్‌కు గురైంది. ఆమె ఆచూకీని 100 రోజుల త‌ర్వాత  పోలీసులు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో గుర్తించారు. ఆమెకు మాయ‌మాట‌లు చెప్పి ఓ పూజారి తీసుకెళ్లాడ‌ని తేల్చారు.

ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లకు చెందిన ఓ వ్యక్తికి మూఢ‌న‌మ్మ‌కాలు ఎక్కువ‌. తన ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయన్న అనుమానంతో   ఓ పూజారిని తీసుకొచ్చి  కొన్ని రోజులుగా ఇంట్లో క్షుద్రపూజలు చేయించాడు. ఆ స‌మ‌యంలోనే అత‌డి మేన కోడ‌లు ఆయ‌న ఇంట్లోనే ఉంటోంది.  

ఈ క్రమంలోనే బాలిక అనారోగ్యానికి గురైంది. ఆమె కోలుకోవాలంటే గుంటూరులోని ఓ ఆలయంలో పూజలు చేయాలని చెప్పిన పూజారి ఇంట్లో వారంద‌రినీ అక్క‌డ‌కు పంపించాడు. ఇంట్లో ఆ మైన‌ర్ బాలిక మాత్ర‌మే ఉంది. దీంతో ఆమెకు పూజారి మాయ‌మాట‌లు చెప్పి తీసుకెళ్లాడు. ఆమె కుటుంబ స‌భ్యులు ఇంటికి వ‌చ్చి చూసేస‌రికి ఆమె క‌న‌ప‌డ‌లేదు.
 
దీంతో బాలిక అదృశ్యంపై పోలీసుల‌కు ఆమె త‌ల్లి ఫిర్యాదు చేసింది. బాలిక మేనమామ ఇంట్లో క్షుద్ర‌పూజ‌ల ఆన‌వాళ్లను గుర్తించారు పోలీసులు. ఆ ఇంట్లో పెద్ద‌గొయ్యి త‌వ్వి ఉండ‌డం చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. ఈ కోణంలో ద‌ర్యాప్తు చేప‌ట్ట‌గా పూజారే ఆమెను అప‌హ‌రించి తీసుకెళ్లాడ‌ని చివ‌రికి తేల్చుకుని ఉత్త‌ర‌ప్రదేశ్‌లో ఆమెను గుర్తించారు. ఈ రోజు నిందితుడిని మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టి పూర్తి వివ‌రాలు వెల్లడించే అవ‌కాశం ఉంది.

More Telugu News