Visakhapatnam: అంబ‌రాన్నంటిన సంబ‌రం.. వ‌కీల్ సాబ్ ట్రైల‌ర్ విడుద‌ల నేప‌థ్యంలో హంగామా.. వీడియోలు వైర‌ల్

 Ruckus erupted at a theatre in Visakhapatnam during the release of the trailer  vakeel sab
  • విశాఖ‌ప‌ట్నంలోని ఓ థియేట‌ర్లో ఎగ‌బ‌డ్డ ఫ్యాన్స్
  • పాల‌కొల్లులో భారీగా ఒక్క‌చోట చేరి హంగామా
  • థియేట‌ర్ల‌లో డ్యాన్సులు
ప‌వ‌ర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పే అవ‌స‌రం లేదు. ఆయ‌న సినిమాలు విడుద‌ల స‌మ‌యంలో ఫ్యాన్స్ చేసే హంగామా అంతాఇంతా కాదు. చాలా కాలం త‌ర్వాత ఆయ‌న న‌టించిన వ‌కీల్ సాబ్ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఆ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు.

న్యాయవాది పాత్రలో ఆయ‌న న‌టిస్తున్న చిత్రం 'వకీల్ సాబ్' నుంచి ట్రైలర్ నిన్న విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు చేసిన హంగామా, జ‌రుపుకున్న వేడుక‌ల‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో తెగ వైర‌ల్ అవుతున్నాయి.
   
విశాఖప‌ట్నంలోని ఓ థియేట‌ర్‌లో ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల సంద‌ర్భంగా అభిమానులు ఎగ‌బ‌డుతూ థియేట‌ర్‌లోకి వెళ్లారు. ఈ క్ర‌మంలో కొంద‌రు కింద‌ప‌డిపోయారు. విశాఖ‌లోని మ‌రో ప్రాంతంలో 108 కొబ్బ‌రి కాయ‌లు కొట్టారు.  పాల‌కొల్లులో అభిమానులంతా ఒక్క చోట చేరి హ‌డావుడి చేశారు. థియేట‌ర్ల‌లో ట్రైల‌ర్ విడుద‌లైన స‌మ‌యంలో ప్రేక్ష‌కులంతా నిల‌బ‌డి డ్యాన్సులు చేస్తూ, కాగితాలు ఎగ‌రేస్తూ అంబ‌రాన్నంటే సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

 కాగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న వ‌కీల్ సాబ్ సినిమాలో పవన్ సరసన శ్రుతిహాసన్ నటించింది. న్యాయ‌వాదిగా ప్రకాశ్ రాజ్, కీల‌క పాత్ర‌ల్లో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల న‌టించారు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై  దిల్ రాజ్,   శిరీష్ నిర్మాతలు. ఈ సినిమా ఏప్రిల్ 9న విడుద‌ల కానుంది.
Visakhapatnam
Vizag
Pawan Kalyan
Vakeel Saab

More Telugu News