Nomula Bhagath: నాగార్జునసాగర్ లో టీఆర్ఎస్ కు ఎవరూ పోటీ కాదు: నోముల భగత్

TRS wins Nagarjuna Sagar bypolls says Nomul Bhagath
  • కేసీఆర్ నాకు అవకాశం ఇస్తారని ఊహించలేదు
  • ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తాం
  • ప్రచారంలో ఎవరు పాల్గొనాలనేది కేసీఆర్ నిర్ణయిస్తారు
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో తమ అభ్యర్థిగా నోముల భగత్ ను టీఆర్ఎస్ పార్టీ బరిలోకి దించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు బీఫామ్ ను అందించారు. ఈ సందర్భంగా భగత్ మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని సీఎం కేసీఆర్ తనకు ఇస్తారని ఊహించలేదని చెప్పారు. సాగర్ లో తమకు ఎవరూ పోటీ కాదని... తమకు తామే పోటీ అని అన్నారు.

కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని చెప్పారు. సాగర్ నియోజకవర్గ ప్రజలకు తన తండ్రి, దివంగత నోముల నర్సింహయ్య ఏం చేశారనేది అందరికీ తెలుసని అన్నారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తామని తెలిపారు. ప్రచారంలో ఎవరు పాల్గొనాలనేది కేసీఆర్ నిర్ణయిస్తారని చెప్పారు.
Nomula Bhagath
Nagarjuna Sagar Bypolls
KCR
TRS

More Telugu News