Nithin: ఈ రోజు అర్థరాత్రి నితిన్ 30వ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

Nithin new movie title and first look will be revealed on tomorrow
  • బాలీవుడ్ హిట్ అంధాధున్ కు రీమేక్
  • నితిన్ సరసన నభా నటేశ్, తమన్నా
  • మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చిత్రం
  • నితిన్ కుటుంబ సభ్యులే నిర్మాతలు
  • జూన్ 11న రిలీజ్
బాలీవుడ్ హిట్ చిత్రం అంధాధున్ చిత్రాన్ని తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నితిన్ కు ఇది 30వ చిత్రం. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లను ఈ రోజు అర్థరాత్రి 12 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సినిమాను నితిన్ కుటుంబ సభ్యులే నిర్మిస్తున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికితా రెడ్డి నిర్మాతలుగా వ్యహరిస్తున్నారు.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నభా నటేశ్, తమన్నా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అంధుడైన పియానో వాద్యకారుడిగా నితిన్ తన కెరీర్ లోనే విలక్షణ రోల్ పోషిస్తున్నాడు. కాగా ఈ సినిమా జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి మహతీసాగర్ సంగీతం అందిస్తున్నాడు. బాలీవుడ్ లో వచ్చిన అంధాధున్ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరో కాగా, రాధికా ఆప్టే హీరోయిన్ గా నటించింది.
Nithin
30th Movie
Title
First Look
Merlapaka Gandhi
Andha Dhun

More Telugu News