పళనిస్వామి కంటతడి పెట్టడం బాధించింది.. క్షమాపణ చెబుతున్నా: డీఎంకే నేత ఎ.రాజా

29-03-2021 Mon 16:47
  • పళనిస్వామిని దూషించాలనే ఉద్దేశం నాకు లేదు
  • రాజకీయ జీవితాలను పోలుస్తూ కామెంట్ చేశానన్న రాజా 
  • రాజాపై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల కేసు నమోదు 
A Raja apologises to Palanaswamy
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని ఉద్దేశించి డీఎంకే నేత ఎ.రాజా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆయన పుట్టుకను కించపరిచేలా రాజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై పళనిస్వామి స్పందిస్తూ, తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారికి భగవంతుడే శిక్షను విధిస్తాడని అన్నారు. ఈ నేపథ్యంలో పళనిస్వామికి రాజా క్షమాపణలు చెప్పారు.

పళనిస్వామి కంటతడి పెట్టడం తనను బాధించిందని రాజా అన్నారు. వ్యక్తిగతంగా ఆయనను దూషించాలనే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని చెప్పారు. రాజకీయ జీవితాలను పోల్చుతూ మాత్రమే తాను ఆ వ్యాఖ్యలు చేశానని తెలిపారు. పళనిస్వామికి క్షమాపణ చెపుతున్నానని అన్నారు. మరోవైపు రాజా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.