KCR: టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు బీ-ఫారం అందజేసిన సీఎం కేసీఆర్

CM KCR gives B Farm to Nomula Bhagat Kumar
  • నాగార్జున సాగర్ లో ఉప ఎన్నిక
  • టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ ఖరారు
  • తెలంగాణ భవన్ లో భగత్ కు బీ-ఫారం అందజేత
  • ఆశీస్సులు అందించిన సీఎం కేసీఆర్
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ పేరు ఖరారైన సంగతి తెలిసిందే. తాజాగా నోముల భగత్ కుమార్ కు సీఎం కేసీఆర్ బీ-ఫారం అందజేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో భగత్ కు బీ-ఫారం అందించిన కేసీఆర్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో  నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులతో పాటు మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జానారెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించగా, బీజేపీ తరఫున కంకణాల నివేదితా రెడ్డి బరిలో దిగుతారని భావిస్తున్నారు. ఇదిలావుంచితే, టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ రేపు నామినేషన్ దాఖలు చేస్తారు.
KCR
Nomula Bhagat Kumar
B-Farm
Nagarjuna Sagar Bypolls
TRS

More Telugu News