డీఎంకే ఎంపీ రాజా వ్యాఖ్యలను నేనెప్పుడూ సమర్థించలేదు: కమలహాసన్
- సీఎం పళనిస్వామిని స్టాలిన్ కాలిచెప్పుతో పోల్చిన రాజా
- రాజా వ్యాఖ్యలను కమల్ సమర్థించినట్టుగా ప్రచారం
- సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన కమల్
- రాజా వ్యాఖ్యలను తాను సమర్థించలేదని స్పష్టీకరణ
ఈ ప్రచారాన్ని కమల్ తాజాగా ఖండించారు. ఎంపీ రాజా వ్యాఖ్యలను తానెక్కడా సమర్థించలేదని స్పష్టం చేశారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కమల్ పై జరుగుతున్న దుష్ప్రచారం పట్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎంఎన్ఎం పార్టీ వర్గాలు కూడా హెచ్చరించాయి.