Pawan Kalyan: 'వకీల్ సాబ్' బెనిఫిట్ షో టిక్కెట్ రూ. 1500.. ఇతర షోల టికెట్ ధర కూడా భారీగా ఉండే అవకాశం!

Vakees Saab movie benefit show ticket rate is rs 1500
  • ఏప్రిల్ 9న విడుదలవుతున్న 'వకీల్ సాబ్'
  • అన్ని చోట్ల బెనిఫిట్ షోలకు ప్లాన్ చేస్తున్న చిత్ర యూనిట్
  • సాధారణ టికెట్ ధర రూ. 300 నుంచి రూ. 500 
పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'వకీల్ సాబ్' కోసం ఆయన అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కు ఉన్న ఫాలోయింగ్ వల్ల ఇప్పటికే ఈ చిత్రం భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం.

మరోవైపు ఈ సినిమాకు అమెరికా సహా అన్ని చోట్ల బెనిఫిట్ షోలను చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అధికారికంగా బెనిఫిట్ షో టికెట్ ధరను రూ. 1500గా నిర్ణయించాలని భావిస్తున్నారట. ఏపీలో విడుదలకు ముందు రోజు రాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షో వేసేలా అనుమతులు తీసుకున్నారట.

తెలంగాణలో మాత్రం సినిమా విడుదలయ్యే ఏప్రిల్ 9న ఉదయం 6 గంటలకు బెనిఫిట్ షో వేయనున్నట్టు సమాచారం. అంతేకాదు, ఈ సినిమా టికెట్ రేట్లను పెంచేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే జీవోలను జారీ చేశాయి. దీంతో టికెట్ ధర రూ. 300 నుంచి రూ. 500 మధ్య ఉండవచ్చని తెలుస్తోంది.
Pawan Kalyan
Janasena
Vakeel Saab
Tollywood
Benefit shows
Ticket Rate

More Telugu News