భారత క్రికెట్ జట్టుకు మహేశ్ బాబు అభినందనలు
- ఇంగ్లండ్ తో అన్ని ఫార్మాట్లలో విజయం
- టెస్టు, టీ20, వన్డే సిరీస్ లు కైవసం
- తిరుగులేని విజయాలంటూ కొనియాడిన మహేశ్ బాబు
- పూర్తి సాధికారతతో గెలిచారని కితాబు
ఇంగ్లండ్ తో తొలుత 3-1తో టెస్టు సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా ఆపై పరిమిత ఓవర్ల సిరీస్ ల్లోనూ సత్తా చాటింది. 4 టెస్టుల సిరీస్ లో తొలి టెస్టులో ఓటమిపాలైన తర్వాత అద్భుత రీతిలో పుంజుకున్న భారత్ వరుసగా మూడు టెస్టుల్లో నెగ్గింది. ఆపై 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 3-2తో కైవసం చేసుకుంది. అనంతరం మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 2-1తో వశం చేసుకుని మూడు సిరీస్ ల్లోనూ విజేతగా నిలిచింది.